ఓ . ఎన్ . జి . సి , గెయిల్ ఇన్ స్టలేషన్స్ లకు భద్రత..జిల్లా కలెక్టర్

ఓ . ఎన్ . జి . సి , గెయిల్ ఇన్ స్టలేషన్స్ లకు భద్రత..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

జిల్లాలో ఉన్న ఓ . ఎన్ . జి . సి . గెయిల్ ఇన్ స్టలేషన్స్ భద్రత పై పూర్తిగా దృష్టి సారించాలని జిల్లా కలక్టర్ డి . మురళీధర్ రెడ్డి అన్నారు . శనివారం జిల్లా కలక్టర్ కార్యాలయంలో పరిశ్రమలు మరియు సంబంధిత భద్రతలపై కలెక్టర్ ఓ . ఎన్ . జి . సి . మరియు గెయిల్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ పైపు లైన్ల ప్రాంతాలలో పాటించవల్సిన విషయాలను తూచా తప్పకుండా సంబంధిత యాజమాన్యాల వారు పాటించాలని ఆయన కోరారు . డివిజనల్ స్థాయి అధికారులు సంబంధిత ఏజెన్సీ వారితో చర్చించి , ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు . భద్రత అనేది అతి ముఖ్యమని , ఓఎన్ . జి . సి . మరియు గెయిల్ అధికారులు ఒక వారంలో తమ యొక్క పైపు లైన్లను పరిశీలించాలని ఆయన కోరారు . రాబోయే 15 రోజుల్లో ఓఎన్ . జి . సి . , గెయిల్ మరియు అగ్నిమాపక సిబ్బంది , సంబంధిత శాఖలతో మాక్ డ్రిల్ నిర్వహించాలని జిల్లా కలక్టర్ ఆదేశించారు . రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వి . జి . వెంకటరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో తగిన అత్యవసర పరికరాలను ఉంచాలన్నారు . తరువాత ఓ . ఎన్ . జి . సి . , గెయిల్ సంస్థల వారు పైపులను ఎప్పటికప్పుడు పరిశీలించి , అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు . అనివార్య పరిస్థితులు సంభవిస్తే చేపట్టవల్సిన చర్యల గురించి ఆయన వివరించారు . అదే విధంగా జిల్లాలో ఓ . ఎన్ . జి . సి . మరియు గెయిల్ వారు సి . ఎస్ . ఆర్ . ఫండ్స్ క్రింద చేయుచున్న పనుల గురించి అడిగి తెల్సుకున్నారు . ఓ . ఎన్ . జి . సి . చీఫ్ జనరల్ మేనేజర్ సి . రవి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఓ . ఎన్ . జి . సి . పైపుల విషయంపై అన్ని భద్రతలు తీసుకున్నట్లు తెలియజేశారు . పైపు లైన్లను 24 గంటలు పరిశీలించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు . ఓ . ఎన్ . జి . సి . జనరల్ మేనేజర్ శంకర్ శిరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఓ . ఎన్ . జి . సి . పైపుల విషయంపై అన్ని భద్రతలు తీసుకున్నట్లు తెలియజేశారు . పైపు లైన్లను 24 గంటలు పరిశీలించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు . ఓ . ఎన్ . జి . సి . జనరల్ మేనేజర్ శంకర్ శిరణ్ మాట్లాడుతూ జిల్లా అధికారుల సమన్వయంతో ఓ . ఎన్ . జి . సి . పైప్ లైన్ల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు . గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి . ఎస్ . ఎస్ . ఆర్ . వి . ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో గెయిల్ కు సంబంధించి అన్ని ఇన్ స్టలేషన్స్ తనిఖీ చేసి వారం రోజుల్లో సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు . గియిల్ డిజిఎం ( ఫైర్ అండ్ సేఫ్టీ ) ఎస్ . వి . రెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం భద్రత విషయాలలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలియజేశారు . ఈ సమావేశంలో జెసి - 2 జి . రాజకుమారి , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved