పరిశ్రమల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

పరిశ్రమల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

విశాఖ ఎల్జీ గ్యాస్ లీక్ ఘటన జిల్లాలో పరిశ్రమల స్థితిగతులపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ అఖిలపక్షం సూచించింది. తెలుగుదేశం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు శుక్రవారం ఈ మేరకు డిఆర్వో సిహెచ్ సత్తిబాబు కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఘటన బాధాకరమని, మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం ఇచ్చిన సడలింపులతో చాలా ప్రదేశాల్లోపరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతున్నాయని, ఈక్రమంలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మానవ తప్పిదమైనా, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా పలువురు ప్రాణాలు కోల్పోయారని ఈ సంఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు నెలకొని ఉన్నాయని, వీటిని పర్యావరణ, పరిశ్రమలశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే పునఃప్రారంభం చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన నుండి పంతం నానాజీ, బన్ను, సీపీఐ తాటిపాక మధు, కాంగ్రెస్ నులుకుర్తి వెంకటేశ్వరరావు,ఆకుల వెంకట రమణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved