రెడ్‌క్రాస్‌ సేవలు ఆదర్శనీయం..కలెక్టర్

రెడ్‌క్రాస్‌ సేవలు ఆదర్శనీయం..కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

ప్రస్తుత సమాజంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్‌ డి. మురళీ ధర్ రెడ్డి అన్నారు.శుక్రవారం కాకినాడ గాంధీ నగర్ లో గల ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకు సమీపంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు వై డి రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సంస్థ ప్రపంచంలోనే ఎంతో అత్యున్నతమైన సంస్థ అని పేర్కొన్నారు యుద్ధ సమయంలో గాయాలైన సైనికులకు సేవ చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చిందన్నారు.కరోనా ప్రభావం అధికంగా ఉన్న సమయంలో రెడ్ క్రాస్ చేసిన సేవలు అభినందనీయమన్నారుప్రస్తుతం 19 దేశాల్లో ఈసంస్థ తన కార్యకలా పాలను నిర్వహిస్తుందన్నారు పేదలకు సాయం అందిస్తూ ముందుకు సాగడం ఎంతో అభినందనీయం అన్నారు. రక్తం అందించేందుకు సకాలంలో ముందుండి రోగులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన రక్తదాతలకు, యువ రెడ్‌ క్రాస్‌ సొసైటీలో కలెక్టర్‌ మెమోంటోలను అందజేసి వారిని సత్కరించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ రీజినల్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved