విశాఖను కమ్మేసిన విష వాయువు

విశాఖను కమ్మేసిన విష వాయువు

user-default Mahendra M | Mob: 9390172012 | 27 Oct

విశాఖలోని ఎల్.‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్‌ అవడంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. మరికొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రసాయన వాయువు పీల్చి నురగలు కక్కుతూ పశువులు నేలకొరిగాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌,ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రసాయన వాయువు పీల్చి ఎంత మంది ఇళ్లలో ఉండిపోయారో తెలియడంలేదు. వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఆరాతీస్తున్నారు. తలుపులు పగులగొట్టి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. కడపటి వార్తలందేనాటికి 8 మంది మృతి చెందినట్ల చెబుతున్నప్పటికీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved