జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య. - జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆదేశాలు.

జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య. - జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆదేశాలు.

user-default | Mob: | 29 Oct

తూర్పు గోదావరి జిల్లాలో ని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో విద్యనభ్యసిస్తున్న జర్నలిస్టు ల పిల్లలందరికీ వంద శాతం ఫీజు రాయితీ కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ ధర్ రెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం కు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఎ.పి.జె.ఎఫ్) ప్రతినిధి బృందం సోమవారం కలెక్టర్ శ్రీధర్ రెడ్డిని కలిసి వివిధ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలలో విద్యనభ్యసిస్తున్న, అభ్యసించబోయే జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి అబ్రహాం ను ఆదేశించారు. జర్నలిస్టు లు తమ వివరాలతో పాటుగా,పిల్లల వివరాలు, వారు విద్యనభ్యసించే ఆయా పాఠశాలలు, కళాశాలల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ వారికి తెలియచేసి వంద శాతం ఫీజు రాయితీ ని పొందవలసినదిగా సూచించారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెడ్డి. తమ విజ్ఙప్తి మేరకు స్పందించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ శ్రీధర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు తంగిశెట్టి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహాం, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ఫ్రాన్సిస్, ఎ.పి.జె.ఎఫ్. ప్రతినిధులు ఎం.వి.ఆర్.ఫణీంద్ర, జి. హేమ ఈశ్వర ప్రసాద్, బి.సత్యంబాబు, రమేష్, సుకుమార్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved