మత్స్యకారులను ఆదుకుంటాం.. రాష్ట్ర మంత్రులు

మత్స్యకారులను ఆదుకుంటాం.. రాష్ట్ర మంత్రులు

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కరోనా లాక్ డౌన్ , సముద్ర వేట నిషేధం అమలుతో జీవనాధారం కోల్పోయి సతమతమౌతున్న మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ మత్స్యకార పథకం ద్వారా ఆదుకుంటోందని ఉప ముఖ్యమంత్రి , రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు . . . బుధవారం మద్యహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం సహాయాలను విడుదల చేసి , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహంచారు . ఈ కార్యక్రమంలో జిల్లా నుండి మత్స్యకార లబ్దిదారులతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినివ్ విశ్వరూప్ , కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత , శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ , కొండేటి చిట్టిబాబు , రాపాక వరప్రసాద్ , పెండెం దొరబాబు , జిల్లా కలెక్టర్ డి మురళీధరెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ సముద్ర చేపల వేటపై ఆధారపడి , ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ , నిషేద కాలంలో మత్స్యకారు పడుతున్న ఇబ్బందులు తన పాదయాత్రలో కళ్ళారా చూసిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన రెడ్డి , వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యనిస్తూ మత్స్యకార భరోసా పథకం తెచ్చారన్నారు . ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ లాక్ డొన్ , ఏప్రియల్ 15 నుండి జూన్ 14 వరకూ 61 రోజుల పాటు అమలౌతున్న మెరైన్ ఫిప్పింగ్ నిషేదం నేపద్యంలో మత్యకారులు జీవనాధారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు లోనౌతున్నారని , ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచి ఆదుకుంటోందన్నారు . ఇందులో భాగంగానే , లాక్ డౌన్ వల్ల ఆర్థిక భారం ఉన్నా , ఎపుడో నవంబరులో వచ్చే మత్స్యకార దినోత్సవం వరకూ వేచి ఉండకుండా మే 6వ తేదీన వారికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హులైన మత్స్యకార కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున భృతిని అందిస్తోందని మంత్రి తెలిపారు . సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ 2018లో పొరపాటున పాకిస్తాన్ తీరజలాలల్లోకి వెళ్లి అరెస్టయిన మత్స్యకారులను తిరిగి స్వదేశానికి రప్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఒక్కక్కరికి 5 లక్షల ఆర్ధిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించిందని , అలాగే ఇటీవల లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకు పోయిన 4300 మత్సకారులను వారివారి గ్రామాలకు తిరిగి తీసుకు వచ్చి 2 వేల రూపాయాల చొప్పున సహాయం అందించిందని తెలిపారు . మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి ని 9 రూపాయలకు పెంచడంతో పాటు రాయితీ వెంటనే అందే ఏర్పాటు చేసిందన్నారు . మత్సకారుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర తీరంలో 8 మేజర్ ఫిప్పింగ్ హార్బర్లు , ఒక ఫిష్ లాండింగ్ ఫెసిలిటీ లను 3 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేపట్టిందన్నారు . జిల్లా కలెక్టర్ డి మురళీధరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 8 నియోజకవర్గాలు పరిధిలోని 12 తీరమండలకు చెందిన 24 , 587 మంది మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ . 24 కోట్ల , 58 లక్షల 70 వేల బృతిని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు . కార్యక్రమంలో జిల్లాలో మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులు కాట్రేనికోన మండలం , గచ్చకాయల పొర గ్రామానికి చెందిన సంగాని పోతురాజు , కాకినాడ రూరల్ మండలం సూర్యారావు పేటకు చెందిన గరికిన యోహాను లు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు , సహాయాలకు కృతజ్ఞతలు తెలిపారు . గతంలో చేపల వేట నిషేద కాలం ముగిసాక ఎప్పుడో ఆలస్యంగా , అరకొరగా బృతి అందేదని , ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కష్ట సమయంలోనే అక్కరకు వచ్చేలా సహాయం అందిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు . ప్రమాదభరితమైన చేపల వేట తప్ప ఏమీ తెలియని తమ కుటుంబాల్లోని పిల్లలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా విద్య నేర్చుకుంటున్నారని , తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయన్నారు . అలాగే పలు జిల్లాల నుండి ముఖాముఖిలో పాల్గొన్న మత్స్యకారులు తమను ఎస్ . సి . జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు . అనంతరం మంత్రులు శాసనసభ్యులు ఎంపి , కలెక్టరు మత్స్యకార భరోసా పథకం సంబంధించి 24 కోట్ల 58 లక్షల 70 వేల రూపాయల చెక్కును విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అదనపు సంచాలకులు పి కోటేశ్వరరావు జాయింట్ డైరెక్టర్ జై రావు , మత్స్యకారు లబ్దిదారులు , మత్స్యశాఖ అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved