మద్యం ముద్దు - ప్రజలు ప్రాణాలు వద్దు ...

మద్యం ముద్దు - ప్రజలు ప్రాణాలు వద్దు ...

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

కరోనా వైరస్ కారణంగా కాకినాడలో పనులు లేకుండా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు, నగర పేద ప్రజలకు 250 మందికి ఆనందభారతి పూర్వ విద్యార్థులు 94 - 95 బాచ్ ల ఆర్థిక సహకారంతో ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో అచ్యుతాపురం లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లోమంగళవారం కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, పార్వతీశం, జై రాజా, ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి టి. అన్నవరం చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తోక ప్రసాద్ మాట్లాడుతూ మద్యం ముద్దు - ప్రజల ప్రాణాల వద్దు అంటున్న రాష్ట్ర సర్కార్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సేవలో సుమారు 40 రోజులుగా పనిచేస్తున్న అందరి సేవ వృధా అయిందని, రాష్ట్ర సర్కార్ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, లాక్ డౌన్ పరిధి ఇంకా పూర్తి కాకుండానే మద్యం అమ్మకాలు చేయడం వల్ల కరోనా వైరస్ మరింత ఎక్కువయ్యే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రసాద్ అన్నారు. భవన నిర్మాణ, ఆటో, హమాలి, వీధి విక్రయ తదితరులు సంఘటిత కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటే ఇలాంటి సందర్భంలో మద్యం అమ్మకాల జరపడంలో ప్రభుత్వం ప్రజలను అవహేళన చేస్తుందని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వం కార్మికులను ఆదుకొనే ఆర్థిక సహాయం పదివేల రూపాయలు అందించాలని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వి రమణ, జై అప్పల రాజు, ప్రసాద్, జీ వెంకన్న బాబు, ఈ చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved