రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు నిరసన దీక్ష

రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు నిరసన దీక్ష

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

రైతుల సమస్యలు పరిష్కరించి , వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు . కౌలు రైతు సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతు సంఘం , కౌలు రైతు సంఘం నిరసన దీక్ష కార్యక్రమం కాకినాడ కచ్చేరిపేట సుందరయ్య భవనంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చేపట్టారు . ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని , ధాన్యం మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు . వర్షాలకు తడిచిపోయిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు . కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నా ఒక కేజీ కూడా ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవని విమర్షించారు . దళారులు కొని కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని రికార్డులు సృష్టించి మిల్లులకు విక్రయిస్తున్నారని అన్నారు . కొన్న ధాన్యానికి సొమ్ము ఇవ్వడంలోనూ జాష్యం చేస్తున్నారని అన్నారు . ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చూయాలని , ఎలువంటి షరతులు లేకుండా కొన్న వెంటనే సొమ్ము చెలించాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా అరటి , కర్వూజ , జామ ఇతర పంటలకు ఎగుమతులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు . అరటి వంటి పండ్లు కుళ్లి పోయి పశు వులు తినడానికి వీలు లేకపోవడంతో పంట రోడ్లపాలు కావడంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు . పండ్లు కార్గో , షిఫులు , రైలు , విమానాల ద్వారా వందల వేల కోట్లు ఎగుమతులు అయ్యేవని , మామిడి పండ్లు సీజన్ కావడంతో కరోనా కారణంగా ట్రాన్స్పోర్టు లేక మామిడి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వమే పండ్లను కొనుగోలు చేసి ఎగుమతులు చేయాలని డిమాండ్ చేశారు .కౌలు రైతు సంఘం గౌరవధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 70 శాతం కౌలు రైతులు కష్టపడి వ్యవసాయం చేసి కనీసం మద్దతు ధర , గిట్టుబాటు ధంలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితని అన్నారు . ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ . 1375 ఎక్కడా అమలు కావడం లేదన్నారు . తేమ పేరుతో కేవలం రూ . 900 నుండి ప్రారంభమయ్యి రూ . 1000లకు మాత్రమే దళారులు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు . అకాల వర్షాల కారణంగా ఇప్పటికే 10వేల ఎకరాలలో పంట దెబ్బ తిందని అధికారులు ప్రకటించారని , అయినా ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం ప్రకటించక పోవడం బాధాకరమన్నారు . తుఫాను కాలంలే వచ్చే ఎటువంటి నష్టపరిహారం రైతులకు అందడం లేదని అన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం సచివాలయ వాలంటరీ ఇనిమ్యురేషన్ జరగాలని కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలని కోరారు . గ్రామ సచివాలయం వాలంటరీల ద్వారా అర్హులైన కౌలు రైతులకు సిసిఎస్సీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె ఎస్ శ్రీనివాస్ , జిల్లా నాయకులు కె వీరబాబు , శేషబాబ్ది , ఎం వీరలక్ష్మి , రమణి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved