ఎ.పి లో 75% పెరిగిన మద్యం ధరలు

ఎ.పి లో 75% పెరిగిన మద్యం ధరలు

user-default Mahendra M | Mob: 9390172012 | 22 Oct

ఆంధ్రప్రదేశ్‌లో మద్య నియంత్రణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ల ప్రతి బాటిల్‌పై ట్యాక్స్‌ విధించారు. అలాగే పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఇంతకు ముందు పెంచిన దానితో కలుపుకుని ఏపీలో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved