సూక్ష్మ నీటి సేధ్యం లక్ష్యం 9 వేల హెక్టార్లు. - కలెక్టర్ మురళీధర్ రెడ్డి

సూక్ష్మ నీటి సేధ్యం లక్ష్యం 9 వేల హెక్టార్లు. - కలెక్టర్ మురళీధర్ రెడ్డి

user-default Mahendra M | Mob: 9390172012 | 27 Oct

తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది 9 వేల హెక్టార్లలో సూక్ష్మనీటి సేద్యం చేపట్టాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ఆయన మైక్రో ఇరిగేషన్‌, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 9 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టాలని లక్ష్యం చేసుకోగా, 4,435 హెక్టార్లలో సాగు జరిగిందని ఏపీఎంఐపీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌ వివరించారు. ఈ ఏడాది మరింతగా ఈ సేద్యాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌ సూచించారు. జూన్‌ ఆఖరు వరకు రైతుల నమోదు ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన పంటలను ఈ-కర్షక్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కొవిడ్‌-19 నేపథ్యంలో ఉద్యాన ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్‌ అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు కేఎస్‌వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved