1.26 లక్షల టన్నుల రబీ ధాన్యం కొనుగోలు: జే.సి లక్ష్మీశ

1.26 లక్షల టన్నుల రబీ ధాన్యం కొనుగోలు: జే.సి లక్ష్మీశ

user-default Mahendra M | Mob: 9390172012 | 31 Oct

తూర్పుగోదావరి జిల్లాలో రబీలో ఉత్పత్తి అయిన 1.26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు సంయుక్త కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, రైస్‌ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 10 వేల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ కింద తీసుకున్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు సీఎంఆర్‌ బియ్యాన్ని గోదాములకు చేర్చాలని మిల్లర్లకు సూచించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో ప్రసాదరావు, డీసీవో పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved