కంటైన్మెంట్ ప్రాంతాలలో నిబంధనలు కఠినం..జిల్లా కలెక్టర్

కంటైన్మెంట్ ప్రాంతాలలో నిబంధనలు కఠినం..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డి . మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు .మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలుత ప్రకటించిన 18 కంటైన్మెంట్ జోన్లలో ప్రస్తుతం 12 కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు . అర్బన్ ప్రాంతాల్లో 10 కంటైన్మెంట్ జోన్లు పిఠాపురంలో ఒకటి , రాజమండ్రి అర్బన్ లో 6 , సామర్లకోటలో ఒకటి , పెద్దాపురంలో ఒకటి , తునిలో ఒకటి ఉండగా , రూరల్ ప్రాంతాల్లోని రెండు జోన్లుగా శంఖవరం మండలంలోని కత్తిపూడి గ్రామం , రాజమండ్రి రూరల్ లోని కొంతమూరు గ్రామం ఉన్నాయన్నారు . ఈ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన కంటైన్మెంట్ వ్యూహాలను , కోవిడ్ - 19 అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తుల స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు . ప్రకటించిన కంటైన్మెంట్ జోన్ల పరివృత ప్రాంతాన్ని , వాటి రాక , పోక మార్గాలను బారికేడ్ చేసి నిరంతరం నిశిత పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు . ఈ క్లస్టర్ల లోనికి బయటికి సంచారంతో పాటు , క్లస్టర్ అంతర్గతంగా కూడా వ్యక్తుల సంచారాన్ని నిషేధించాలని , కేవలం నిత్యావసర సరుకులు , సేవలు , వైద్య సహాయం కొరకు మాత్రమే నియంత్రితంగా అనుమతించాలన్నారు . ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా కంటైన్మెంట్ క్లస్టర్లలోని ప్రజల ఇంటికే కూరగాయలు , పండ్లు , ఇతర నిత్యావసరాలు అందజేయాలని , వాటి కొరకు ప్రజలు గుమిగూడ కుండా నివారించాలని కోరారు . ఇందుకు క్లస్టర్ పరిధిలో సంచరించే వాహనాలు , వ్యక్తుల వివరాలను తప్పని సరిగా రికార్డు చేయాలన్నారు . కోవిడ - 19 అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రతి క్లస్టర్ లోను హౌస్ - టు - హౌస్ సర్వైలెన్స్ టీములను ఏర్పాటు చేసి ఇంటింటి సందర్శనలు , టెస్టింగ్ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు . పాజిటీవ్ కేసులు గుర్తిస్తే క్వారంటైన్ కు తరలించాలని , అన్ని కేసుల కాంటాక్ వ్యక్తుల సమాచారాన్ని 12 నుండి 24 గంటలలోపు ఎంఎస్ఎస్ వెబ్ సైట్లో నమోదు చేసి , వైద్య అధికారి సూచన , రిస్క్ అంచనా మేరకు పోమ్ క్వారెంటైన్ లేదా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచాలన్నారు . అన్ని క్లస్టర్లలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు , ఇన్ ఫ్లూయెంజా వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులందరికీ వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచించిన పరీక్షలు విధిగా నిర్వహించాలని ఆదేశించారు . అలాగే పాజిటీవ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్ కేసులు , హై రిస్క్ కేటగిరిలో ఉండే ప్రజలు , 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు , ఇతర కో మర్బిడ్ వ్యాధులు కలిగిన వారికు , హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న అధికారులు , సిబ్బందికి కొవిడ్ - 19 పరీక్షలు తప్పని సరిగా నిర్వహిచాలని ఆదేశించారు . కంటైన్మెంట్ క్లస్టర్లలోని నూరు శాతం జనాభా ఆరోగ్య సేతు యాప్ తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకునేట్లు చూడాలన్నారు . ఆరోగ్య విద్య , కౌన్సిలింగ్ కార్యక్రమాలను కంటైన్మెంట్ క్లస్టర్లలలో విస్తృతంగా నిర్వహించి ప్రజలలో ధైర్యాన్ని , విశ్వాన్ని నింపాలని జిల్లా కలెక్టర్ మురధరరెడ్డి అధికారులను ఆదేశించారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved