తొలి రోజు 35 రిజిస్ట్రేషన్ లు

తొలి రోజు 35 రిజిస్ట్రేషన్ లు

user-default suresh gona | Mob: 7799146666 | 07 Jul

జిల్లా లో కరోనా వైరస్‌ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ పైతీవ్ర ప్రభావం చూపిందిలౌక్ డౌన్ ఆంక్షలను సడలింపు చేయడంతో జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి రెడ్ జోన్ పరిధి లో ఉన్న రాజమహేంద్రవరం ,తుని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకోలేదు జిల్లా వ్యాప్తంగా 35 సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉన్నాయి వీటిలో రాజమండ్రి ,తుని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రెడ్ జోన్ పరిధిలో ఉండడంతో 33 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 35 రిజిస్ట్రేషన్ జరిగాయి కాకినాడ డివిజన్ పరిధిలో ఇరవై రిజిస్ట్రేషన్లు, రాజమండ్రి డివిజన్ పరిధిలో 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి ముఖ్యంగా రాష్ట్ర ఖజానా నింపే శాఖల రాబడులకు భారీగా గండి పడుతోంది. లౌక్ డౌన్ పరిమితులతో కూడిన వెసులుబాటు కల్పించినా భూములు, ఆస్తుల క్రయ విక్రయాలు పడిపోవడంతో ఆదాయం తగ్గింది. జిల్లా పరిధిలో 33 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తుండగా కేవలం 35 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేయడం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. లాక్‌డౌన్‌ ప్రభావం ఎన్నాళ్లుంటుందో అప్పటి వరకు ఆ శాఖకు రాబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.    లేఖర్ల స్వచ్ఛందంగా విధుల బహిష్కరణ..                   లౌక్ డౌన్ ను సడలించిన ఇప్పటికీ లేఖర్లు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు రిజిస్ట్రేషన్ ఈ ప్రక్రియలో భూమి స్థలాలు క్రయవిక్రయాలలో అనేక నిబంధనలు పాటించాలని కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లేఖర్లు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించామని ,లౌక్ డౌన్ విధించిన 17 వ తేదీ వరకు విధులకు హాజరు కావని తెలిపారు                                                               

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved