మోదీ ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్.. మరి జగన్ ప్రమాణస్వీకారానికి?

మోదీ ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్.. మరి జగన్ ప్రమాణస్వీకారానికి?

user-default Naresh | Mob: 9491212755 | 25 Oct

ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జ‌గ‌న్, దేశ ప్రధానిగా మోదీ ఒకే రోజు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రూ ముహూర్తాలు నిర్ణ‌యించుకోవ‌టంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతుండగా.. మోదీ ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లు హాజరవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఏపీ పర్య‌ట‌న ఖ‌రారైంది. ఈనెల 29న రాత్రికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విజ‌య‌వాడ చేరుకుంటారు. 30వ‌తేదీ ఉద‌యం క‌న‌క‌దుర్గ‌ను ద‌ర్శించుకున్న త‌రువాత జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజరవుతారు. ఈ నెల 30న విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాలంటూ మోదీని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి జ‌గ‌న్ ఆహ్వానించారు . అయితే అదే రోజు త‌న ప్ర‌మాణ స్వీకారం కూడా ఉండ‌టంతో తాను రాలేన‌ని మోదీ స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో త‌న త‌ర‌పున ప్ర‌తినిధిని పంపిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆ వెంట‌నే బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాతోనూ జ‌గ‌న్ స‌మాశ‌మ‌య్యారు. త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాలంటూ అమిత్ షాను జ‌గ‌న్ ఆహ్వానించారు. జ‌గ‌న్‌తో ఏపీ భ‌వ‌న్‌లో బిజేపీ ముఖ్య నేత రాం మాధ‌వ్ క‌లిసి ఏపీ రాజ‌కీయాల పైన చ‌ర్చించారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి మోదీ- అమిత్ షా ప్ర‌తినిధులుగా నేత‌లు హాజ‌రువుతున్నార‌ని వివ‌రించారు. ఇక‌, ప్ర‌ధానిగా వ‌రుస‌గా రెండో సారి మోదీ ఈనెల 30వ తేదీ రాత్రి 7గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. మోదీ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల్సిందిగా ఏపీ-తెలంగాణ ముఖ్య‌మంత్రుల‌కు ఆహ్వానాలు అందాయి. 30వ‌తేదీ మ‌ధ్నాహ్నం త‌న ప్ర‌మాణ స్వీకారం ముగిసిన వెంట‌నే జ‌గ‌న్‌, కేసీఆర్ గ‌న్న‌వ‌రం నుండి ప్ర‌త్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved