విద్యుత్ బిల్లులు చూస్తే కరెంటు షాక్ తప్పదు?

విద్యుత్ బిల్లులు చూస్తే కరెంటు షాక్ తప్పదు?

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 31 Oct

ఏపీలో వినియోగదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్ బిల్లులు ➡️ఏప్రిల్‌లో స్పాట్ బిల్లింగ్ నిలిపివేత ➡️ఈ నెలలో రీడింగ్ తీస్తుండడంతో 500 యూనిట్లు దాటిపోతున్న వైనం ➡️టారిఫ్ మారిపోయి వేలల్లో బిల్లులు ఏపీలో విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలల్లో వస్తున్న బిల్లులు చూసి అవాక్కవుతున్నారు. ఏప్రిల్ నెలలో మీటరు రీడింగ్ తీయకుండా సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా గ్రూప్ టారిఫ్ నిర్ణయించి బిల్లులు వసూలు చేయడమే ఇందుకు కారణం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏప్రిల్‌లో స్పాట్ బిల్లింగ్‌ను నిలిపివేసింది. దీంతో మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్‌ వినియోగంతో కలిపి మేలో బిల్లులు జారీ చేస్తోంది. ఫలితంగా కేటగిరీ మారిపోవడంతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడం, దీనికితోడు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. 500 యూనిట్లను దాటిన వినియోగదారులకు బిల్లు వేలల్లో వస్తున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved