జి.వో.నెంబర్ 03 రద్దు తీర్పును, పునః పరిశీలన చేయాలి .

జి.వో.నెంబర్ 03 రద్దు తీర్పును, పునః పరిశీలన చేయాలి .

user-default అత్తిలి వెంకన్న | Mob: 8639086609 | 27 Oct

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసి గిరిజనులకు ఉపాధ్యాయ తదితర ఉద్యోగాల్లో 100% నియామకం కల్పించే జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని సి.పి.ఐ (ఎం.ఎల్. )న్యూ డెమోక్రసీ వ్యతిరేకిస్తోంది. ఆ జీవోను పునః పరిశీలన చేసి, ఉద్యోగ రక్షణకు పార్లమెంటులో చట్టం చేయాలి. ఆ జీవో నెంబర్ 3 ను కొనసాగించాలి. ఉభయ రాష్ట్రాల శాసనసభలు గిరిజన సలహా మండళ్ళ లో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ ( ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తుంది అని. ఈ రోజున వేలేరుపాడు మండల తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరుగురు తో కూడిన ప్రతినిధి వర్గం నిరసన తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కార్యదర్శి షేక్ గౌస్, జిల్లా నాయకులు పూరెం.లక్ష్మయ్య,జి.ముత్యాల రావు,సోయం చందు, కె. వీరా స్వామి యస్.రామారావు, తదితరులు పాల్గొనటం జరిగింది

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved