సి.పి.ఐ పార్టీ ఆద్వర్యంలో మౌన దీక్షలు ప్రారంభం

సి.పి.ఐ పార్టీ ఆద్వర్యంలో మౌన దీక్షలు ప్రారంభం

user-default అత్తిలి వెంకన్న | Mob: 8639086609 | 29 Oct

ఈరోజు సి.పి.ఐ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేయాలనే పిలుపుమేరకు సంఘీభావంగా.. వేలేరుపాడు మండల స్థానిక సి.పి.ఐ పార్టీ ఆఫీసులో మౌన దీక్షలు ప్రారంభించారు. కరోనా విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను, వలస కూలీలను,భవన నిర్మాణ కార్మికులను ,పేదలను,చేనేత కార్మికులను ఆదుకోవాలని, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గోడౌన్లో నిల్వ ఉన్న ఆహారధాన్యాలను పేదలకు పంపిణీ చేయాలి, ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ,యాభై కేజీల గోధుమలు ఉచితంగా ఇవ్వాలి ,కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి ,రైతులు ,చిరువ్యాపారులు ,స్వయం ఉపాధి కల్పన కింద తీసుకున్న బ్యాంకు రుణాలు రద్దు చేయాలి చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్రానికి లక్ష కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి, వలస కూలీల అందర్నీ స్వస్థలాలకు చేర్చాలి, ఆకలి చావులకు ఆస్కారం లేకుండా చూడాలి, గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలి ,పెన్షనర్లకు పూర్తి పెన్షన్ చెల్లించాలి ,ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కరోనా పై పోరాడుతున్న వైద్యులు ,వైద్య సిబ్బంది ,పోలీస్ ,పారిశుద్ధ కార్మికులు, మీడియా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని సిపిఐ వేలేరుపాడు మండలం సమితి నుండి డిమాండ్ చేస్తున్నాం అన్నారు.ఈ దీక్షలో సి.పి. ఐ. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి మునీర్ సి.పి.ఐ మండల కార్యదర్శి సన్నేపల్లి సాయిబాబు సి.పి.ఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బాడిస రాము మౌన దీక్షలో పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved