ప్రభుత్వ కొలువుకు కనీస విద్యార్హత ఇంటర్

ప్రభుత్వ కొలువుకు కనీస విద్యార్హత ఇంటర్

user-default Mahendra M | Mob: 9390172012 | 29 Oct

ప్రభుత్వ కొలువుకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత గా నిర్ణయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉండగా ఏపీ దానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్ గా నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. దీనితో పాటు అకడమిక్ క్యాలెండర్ అంశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా మార్చి 3 వ వారం నుంచి విద్యార్థుల చదువులకు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించకుండానే 1 నుండి 9వ తరగతి వరకు ప్రమోట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించాయి. ఇప్పడుు ఏపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం క్యాలెండర్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన క్యాలెండర్ లో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved