160 మందికి కరోనా పరీక్షలు

160 మందికి కరోనా పరీక్షలు

user-default suresh gona | Mob: 7799146666 | 09 Jul

తుని పట్టణంలో రెడ్ జోన్ ఏరియా లో రెండో రోజు కూడా కరోనా పరీక్షల ను కొనసాగించారు. పట్టణంలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి చుట్టూ 500 మీటర్ల పరిధిలో గల వారందరికీ కరోనా పరీక్షలునిర్వహిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం పుగాకు వర్తక సంఘం కళ్యాణమండపం, ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో శనివారం 180 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆదివారం మరో 160 మంది కి కరుణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం కూడా ఈ శిబిరాలు కొనసాగే అవకాశాలున్నాయి. స్థానిక గొల్ల అప్పారావు సెంటర్ నుంచి బాలికోన్నత పాఠశాల వరకు మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని విధులను రెడ్ జోన్ గా ప్రకటించి మూసి వేశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేశారు. ప్రతి ఇంటిలో ఒక వ్యక్తికి మున్సిపల్ అధికారులు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. పాలు నిత్యావసర సరుకులు కూరగాయల కోసం ఆ వ్యక్తి రోజుకు ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రెడ్ జోన్ లో ఇప్పటివరకు 340 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, డి.ఈ. కనకారావు, శానిటరీ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కిషోర్ బాబు రెడ్ జోన్ ఏరియా లో పర్యటించి పర్యవేక్షిస్తున్నారు. వైద్య శిబిరాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved