భూసేకరణలో అవకతవకలు : గోరంట్ల ఆరోపణలు

భూసేకరణలో అవకతవకలు : గోరంట్ల ఆరోపణలు

user-default Babi Mahendra Malireddy | Mob: 7794982345 | 22 Oct

పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనలను విస్మరించి కాకినాడ వద్ద మడ అడవులను ధ్వంసం చేసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌, గ్రామీణం, రాజానగరం పరిధిలోని ఆవ భూముల్లో స్థలాలు కేటాయిస్తున్నారని, బూరుగుపూడి, వెలుగుబంద, కాటవరంలో బురద కాల్వలు ఉన్న చోట్ల భూములు ఇస్తున్నారన్నారు. జిల్లాలో పేదల ఇళ్ల పేరుతో రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. అధికార పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదరక విషయం బయటకు వచ్చిందన్నారు. భూ కుంభకోణాలపై విచారణ జరగాలన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved