JNTUK రిజిస్ట్రార్ గా సత్యనారాయణ

JNTUK రిజిస్ట్రార్ గా సత్యనారాయణ

user-default | Mob: | 31 Oct

*_జె.ఎన్.టి.యు.కె రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ సి.హెచ్.సత్యనారాయణ.జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ సి.హెచ్.సత్యనారాయణ ను నియామిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అమరావతి లో జె‌.ఎన్.టి.యు.కె వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ లింగరాజు అధ్యక్షతన బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో రిజిస్ట్రార్, రెక్టార్ ల తో పాటుగా పలు విభాగాల అధిపతులను మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రెక్టార్ గా ప్రొఫెసర్ జి.వి.ప్రసాద రాజును పాలకమండలి నియమించింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమ చంద్రారెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved