కార్తీక పౌర్ణమి సందర్భంగా నారికేళ జలలతో పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా నారికేళ జలలతో పూజలు

user-default | Mob: | 27 Oct

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీ పీఠం లో శ్రీ ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష నారికేళ జలాలతో అభిషేకం ఘనంగా జరిగింది అనంతరం లక్షా అరటి పండ్లతో ఆంజనేయ స్వామి వారికి 108 మంది అవివాహితుల తో మన్య సూక్త పారాయణ పూజా కార్యక్రమం అన్నదానం చిదంబర శాస్త్రి గారు నిర్వహించారు అత్యంత వైభవంగా ఘనంగా కన్నుల పండుగగా జరిగింది ఇదే సమయంలో సుందరేశ్వర స్వామి వారికి లక్షపత్రి పూజ కార్యక్రమం జరిగింది కార్తీక పౌర్ణమి రోజున పంచ గ్రహ కూటమి వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తే కూడదని లోక కళ్యాణార్థం స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు శివనామస్మరణతో శ్రీ పీఠం మారుమోగింది సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపార్చన శాంతి కళ్యాణం లక్షా విశేష పుష్పార్చన జరగనుంది ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు లక్ష నారికేళ అభిషేకం కేవలం మూడు గంటల్లో వైభవంగా జరిగింది స్వామి పరిపూర్ణానంద స్వామీజీ స్వహస్తాలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved