సంస్కరణ వాది "శేషన్"

సంస్కరణ వాది "శేషన్"

user-default | Mob: | 22 Oct

క‌ల్లోల వేళ కూడా అద‌ర‌క బెద‌రక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించిన ఉత్త‌మోత్త‌మ అధికారి ఆయ‌న‌. ఓట‌ర్ గుర్తింపు కార్డులు జారీ మొద‌లుకొని నిబంధనావళి క‌ఠిన‌త‌రం చేసి అమ‌లుల్లో అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్న అతి సామాన్యుడి గొంతు క..ఒక సారి రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మిపాల‌యిన‌ప్ప‌టికీ క‌డ‌దాకా అవే విలువ‌లే త‌నకు కేరాఫ్ గా మార్చుకుని బ‌తికి నిరాడంబ‌రుడు. ఇవాళ చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు కొన్ని విశిష్టాధికారాలున్నా వాటి అమ‌లు నిరాట‌కంగా సాగుతున్నా అందుకు ఆయ‌న తీసుకున్న చొర‌వే..ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌నే శేష‌న్ .. ఆయ‌నే విశేష‌న్‌.. ఇటీవ‌ల తుదిశ్వాస విడిచిన ఆయ‌నకు అంజ‌లి ఘ‌టిస్తూ నాటి విశేషాలను స్మ‌రిస్తూ జ‌రిగిన సంస్మ‌ర‌ణ స‌భ నాటి నేటి పాల‌నా వ్య‌వ‌స్థ‌లను బేరీజు వేస్తూ, నిజాయితీ ఉన్న ప్ర‌భుత్వ అధికారులు, ప్ర‌జ‌లతో మ‌మేకం అయి పాల‌న‌ను ప‌రుగులెత్తించిన శేష‌న్ లాంటి ఉత్త‌మ స్థాయీ వ్య‌క్తులు ఎన్న‌టికీ ఘ‌న కీర్తితోనే చ‌రిత్ర పేజీల‌లో చోటు ద‌క్కించుకుంటార‌ని సంస్మ‌రించారు. మీడియా జేఏసీ నేతృత్వాన జ‌రిగిన స‌భ ఇప్ప‌టి పాల‌న వ్య‌వ స్థల్లో కాస్త‌యినా మెరుగుద‌ల వ‌చ్చి ఎన్నిక‌ల వేళ నియ‌మావ‌ళి అమ‌లుకు ఓ స‌ముచిత స్థానం వ‌చ్చిందంటే అందుకు కార‌ణం ఆయ‌నేనని స్మ‌రించుకుంది.. ఆ వివ‌రాలివి.. శ్రీ‌కాకుళం : ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ గా నిబ‌ద్ధ‌త ఉన్న అధికారిగా తిరునెళ్లై నారాయ‌ణ అయ్య‌ర్ శేష‌న్ (టీఎన్ శేష‌న్) విఖ్యా తిని ఆర్జించార‌ని ప‌లువురు వ‌క్త‌లు నివాళి ఇచ్చారు. స్థానిక రెవెన్యూ అతిథి గృహాన ఆయ‌న సంస్మ‌ర‌ణ స‌భ‌ను ప్ర‌సార‌, ప్ర‌చుర‌ణ మాధ్యమాల సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందం (మీడియా జేఏసీ) నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా సంబంధిత ప్ర‌తినిధులు మాట్లాడు తూ పౌర స‌మాజం గ‌ర్వించే రీతిలో ఎన్నిక‌ల వేళల్లో విధులు నిర్వ‌ర్తించి గొప్ప సంస్క‌ర‌ణ‌కు, నిబ‌ద్ధ‌త‌కు చిరునామాగా నిలిచి, పే రు గ‌డించార‌ని గుర్తు చేసుకున్నారు.కేర‌ళ తీరాన పుట్టి, దేశ వ్యాప్తంగా ఉన్న‌త సేవ‌లు అందించి, 87 ఏళ్ల వ‌య‌స్సులో ఈ లోకం విడిచిపో యార‌ని, ఆయ‌న తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణల కొన‌సాగింపు చేయాల్సిన బాధ్యత గౌర‌వ వ్య‌వ‌స్థ‌పై ఉంద‌న్నారు. రాన్రానూ వ్య‌వస్థ‌ల్లో క‌చ్ఛితత్వం పోతున్న ఈ స‌మ‌యాన అటువంటి ఐఏఎస్ అధికారుల స్మ‌ర‌ణ క‌నీస బాధ్యత‌గా భావించి ఈ సంస్మ‌ర‌ణ స‌భ‌కు పూ నిక వ‌హించామ‌ని అన్నారు. హార్వార్డ్ యూనివ‌ర్శిటిలో పబ్లిక్ ఎడ్మిన్ స్ట్రేష‌న్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ అందుకుని, అటుపై ఆరేళ్ల‌పాటు కేంద్ర ఎన్నిక‌ల అధికారిగా గుర్తింపు తెచ్చుకుని, రామ‌న్ మెగ‌సెసే అవార్డు గ్ర‌హీత‌గా అంద‌రి హృదిలో చిర‌స్థాయిగా ని లిచిన ప్ర‌తి సంద‌ర్భాన్నీ మ‌రువ‌లేం అని, ఇవాళ వ్య‌వ‌స్థ‌ల్లో జ‌వాబుదారీత‌నం లేద‌ని, కొన్నింట స‌రైన రీతిలోఅధికారులు లేర‌ని మ‌థ‌న‌ప డుతున్న స‌మ‌యాన ఇటువంటి అధికారుల స్ఫూర్తితో అయినా కొంత‌లో కొంత మార్పు వ‌స్తే అది ఆశాజ‌నకంగా భావి స్తామ‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళిని అమలు చేసి, సామాన్యుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశార‌న్నా రు. సీనియ‌ర్ సివిల్ స‌ర్వెంట్ గా ఈ దేశం ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు పెట్టుకుని, ఆయ‌న దారిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను కానీ మ‌రే ఇత‌ర ప్ర‌భుత్వ సంబంధిత ప్ర‌ణాళిక‌ల అమ‌లు కానీ చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కార్య‌క్ర‌మంలో మీడియా జేఏసీ క‌న్వీన‌ర్ శాస‌పు జోగినాయుడు, వాక‌ర్స్ ఇంట‌ర్నేష‌నల్ గ‌వ‌ర్న‌ర్ కేవీఆర్ మూర్తి, మాజీ గ‌వ‌ర్న‌ర్ గేదెల ఇందిరా ప్ర‌సాద్, సీఐటీయూ న‌గ‌ర కార్య‌ద‌ర్శి ఎం.తిరుపతిరావు, జేఏసీ ప్ర‌తినిధులు సూరు చంద్ర‌శేఖ‌ర్, ఎంఏవీ స‌త్య‌నారాయ‌ణ, బార్ అసోసియేష న్ మాజీ అధ్య‌క్షులు వాన కృష్ణ చంద్, వైఎస్సార్సీపీ యువ‌నేత వాన స‌న్నీ, పాత్రికేయులు ముళ్ల‌పూడి సాయి కుమార్, ర‌హీమ్, శ్యామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved