కాకినాడ మంత్రి కన్నబాబు ఇంటివద్ద ఉద్రిక్తత

కాకినాడ మంత్రి కన్నబాబు ఇంటివద్ద ఉద్రిక్తత

user-default | Mob: | 27 Oct

మంత్రి ఇంటివద్ద ఉద్రిక్తత. కాకినాడ : ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. నిర్మాణ కార్మికులు సర్పవరం సెంటర్ నుండి రమణయ్య పేట లోని మంత్రి కురసాల కన్నబాబు ఇంటి వరకు నిరసన ర్యాలీ చేయగా మంత్రి ఇంటివద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు మంత్రి ఇంటికి చోచ్చుకువవచ్చేందుకు ప్రయత్నించగా ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కార్మికుల పై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈసందర్భంగా సీఐటీయూ నాయకులు చెక్కల రాజకుమార్ మాట్లాడుతూ ఇసుక లేక భవన నిర్మాణకార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డారన్నారు.ఇతర అనుబంధ రంగాల కార్మికులు పనులు లేక కుటుంబాలతో పస్తులు వుంటున్నారన్నారు. వెంటనే ఇసుక సరఫరా చేయాలని, పనులు లేక జిల్లాలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, గత ఐదు నెలలు గా పనులు కోల్పోయిన కార్మికులకు పదివేలు జీవనభృతి చెల్లించి ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన కార్మికులను సర్పవరం పోలీసు స్టేషన్ కు తరలించారు. గాయపడిన వారిని జిజిహెచ్ కు తరలించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved