మీకు గుర్తుందా?

మీకు గుర్తుందా?

user-default | Mob: | 22 Oct

సరిగ్గా 29 సంవత్సరాల క్రితం ఇదేరోజున (1990 అక్టోబర్ 30 వ తేదీన) అయోధ్యలో ప్రథమ కరసేవ జరిగింది. పురుగును కూడా అయోధ్యలోకి అడుగుపెట్టనివ్వను అంటూ ఆనాటి ఉ.ప్ర ముఖ్యమంత్రి ములాయంసింగు చేసిన శపథాన్ని లెక్క చేయకుండా వేలాదిమంది కరసేవకులు అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. ప్రభుత్వం అమానుషంగా జరిపిన కాల్పులలో వందలాదిమంది అసువులు బాశారు, గాయాలపాలయ్యారు. అయినప్పటికీ భయపడకుండా వలయంలోకి ప్రవేశించి అభిమన్యుడి వలె పోరాడి దుష్ట బాబరుచే నిర్మించబడిన కళంకిత కట్టడంపై కొఠారీ సోదరులు కాషాయధ్వజాన్ని ఎగురవేశారు. రెండురోజుల అనంతరం పోలీసులు వారిని పట్టుకొని కాల్చి చంపేశారు. హిందూధర్మ రక్షణకై వీరోచితంగా పోరాడి అసువులుబాసి హుతాత్ములైన ఎందరో బంధువులకు ఘన నివాళి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved