ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై ప్రైవేటు ఫైనాన్స్ ల అగడాలు అరికట్టాలి

ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై ప్రైవేటు ఫైనాన్స్ ల అగడాలు అరికట్టాలి

user-default | Mob: | 27 Oct

కాకినాడ టాటా మాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ (CITU అనుబంధం) సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం కచేరి పేట సీఐటీయూ కార్యాలయంలో లో దూదిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి పి .రమేష్ మాట్లాడుతూ కమిటీ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సి ఐ టి యు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ట్రాన్స్ పోర్ట్ వాహనదారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. చట్టప్రకారం వాయిదా చెల్లించడానికి 90 రోజులు గడువు ఉన్నప్పటికీ ముందుగానే వాహనాలు సీజ్ చేయడం సమంజసం కాదన్నారు. ఫైనాన్స్ కంపెనీలు షోరూమ్ రుసుము కు 70 శాతం మాత్రమే లోను ఇవ్వాల్సి ఉండగా 95% లోన్ ఇస్తూ వాహన యజమానుల నుండి భారీ మొత్తంలో వడ్డీలు కట్టించుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ట్రాన్స్ పోర్ట్ వాహనదారులపై ఆగడాలు ఆపకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. యూనియన్ కోశాధికారి కె. సత్తిబాబు జమా ఖర్చుల నివేదిక ప్రవేశపెట్టారు .కేంద్ర ప్రభుత్వ వాహన సవరణ చట్టం మన రాష్ట్రంలో అమలు చేయ రాదని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. టాటా మ్యాజిక్ స్టాండ్ విషయంలో లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందించిన సహకారం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో వాలిశెట్టి శ్రీను, బాబి, భాష ,మూర్తి, రాఘవ, వీరబాబు, రాంబాబు, కుబేరు, బషీర్ తదితరులు పాల్గొన్నారు....

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved