పంచాయతీ కార్మికుల ధర్నా

పంచాయతీ కార్మికుల ధర్నా

user-default | Mob: | 27 Oct

పంచాయతీ కార్మికుల 2వ సమ్మె ఆందోళన కలెక్టరేట్ వద్ద.... కాకినాడ, అక్టోబర్ 29; గ్రామపంచాయతీ కార్మికులు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కై చేపట్టిన సమ్మె రెండవ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనతో జరిగింది .. ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కా. సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో టెండర్ విధానం రద్దు చేయాలని జీవోలు ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి హామీ ప్రకారం పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.గ్రామ సచివాలయం పోస్టులలో అర్హులైన పంచాయతీ కార్మికులకు అవకాశం కల్పించి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం జిల్లా పరిషత్ మీదుగా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు . డప్పుల దరువు లతో, నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్ధరిల్లింది. ఈ కార్యక్రమంలో లో నగర నాయకులు మేడిశెట్టి వెంకటరమణ , రామకృష్ణ లతోపాటు రూరల్ మండలంలోని వివిధ పంచాయతీల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడో రోజు సమ్మె ఆందోళన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద నిర్వహిస్తామని మేడిశెట్టి వెంకటరమణ ఓ ప్రకటనలో తెలియజేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved