రాజమండ్రిలో అంగన్‌వాడీ మహాసభలు

రాజమండ్రిలో అంగన్‌వాడీ మహాసభలు

user-default | Mob: | 28 Oct

నవంబర్ 17నుండి రాజమహేంద్రవరం లో జరుగుతున్న అంగన్వాడీ యూనియన్ అఖిల భారత 9వ మహాసభలు జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మంగళవారం నగరం లో వివిధ అంగన్వాడీ సెక్టార్ లలో పర్యటించి ప్రచారం నిర్వహించారు..... దేశంలో అతి పెద్ద శ్రామిక మహిళా సంఘం ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (AIFAWH)అని పేర్కొన్నారు... దేశంలో మాతాశిశు మరణాలు అరికట్టడం లో ఐసిడిఎస్ అద్భుతమైన పాత్ర పోషిస్తుందన్నారు.... ఐసిడిఎస్ ను సంస్థాగతం చేసి అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలన్నారు.... గడిచిన మహాసభ కాలంనుండి ఈకాలంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమాలు పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నారు న్నారు... రాబోయే కాలంలో ఉద్యమాల నిర్వహణకు నూతన కమిటీ ని ఎన్నుకుంటామన్నారు..... జిల్లా లో ఉన్న అంగన్వాడీ సోదరీమణులంతా ఈ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు....ఈ పర్యటనలో నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం.రమణమ్మ, కె.కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved