నైపుణ్యాభివృద్ధికి రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం

user-default Sathya | Mob: 9248040968 | 19 Oct

ఉద్యోగాలు, ఉపాధి కల్పించే చదువులు, నైపుణ్య శిక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వర్సిటీకి అనుబంధంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక కళాశాల ఏర్పాటు చేయడంతోపాటు..ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని వర్సిటీతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశ్వవిద్యాలయం కోసం మూడు, నాలుగు రోజుల్లో ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, బీకాం సహా డిగ్రీ కోర్సులు చదువుతున్న వారికి అదనంగా ఏడాది అప్రెంటిస్‌ అందించాలని, ఈ సమయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని సూచించారు. అవసరమనుకుంటే మరో 6నెలలు శిక్షణ, ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యోగం, ఉపాధి పొందడమే లక్ష్యంగా ఈ కోర్సుల పాఠ్యప్రణాళికల్లో మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved