shift control n తో ఆన్లైన్ టిక్కెట్ ధరలకు కళ్ళెం వేయండి

shift control n తో ఆన్లైన్ టిక్కెట్ ధరలకు కళ్ళెం వేయండి

user-default | Mob: | 22 Oct

విమాన టికెట్ల ధరలు చాలా వేగంగా మారిపోతుంటాయి. ఒకే ప్రయాణానికి సంబంధించిన టికెట్ల కోసం పలుమార్లు నెట్ లో సెర్చ్ చేస్తే చాలా వేగంగా పెరిగిపోతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే విమానయాన టికెట్లను కొంత చౌకగా పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేవారు విమానయాన టికెట్లను ముందుగానే బుక్ చేసుకోకపోతే భారీగా అధిక మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఒక వస్తువును కాని, ప్రయాణ టిక్కెట్ల (విమానం)ను బుక్ చేసుకొనేందుకు,మనం ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజరులో మనకు తెలీయకుమనడా కొన్ని వెబ్సైట్ లు మనకు తెలియకుండానే కుకీలను ఇన్ స్టాల్ చేస్తాయి. ఇవి మన నెట్ లో ఏమి వెతుకుతున్నామో ట్రాక్ చేస్తాయి. ఒకే మార్గంలో ప్రయాణం కోసం అదేపనిగా నెట్ లో సెర్చ్ చేస్తుంటే మనం భయపడి అప్పటికప్పుడే టికెట్లు బుక్ చేసుకునేలా ధరలను పెంచుతుంటాయి. దీనికో పరిష్కార మార్గం ఉంది. మనం వెతికే బ్రౌజరులో ‘ప్రైవేటు మోడ్ ’ ఉంటుంది. కీబోర్డుపై షిఫ్ట్ +కంట్రోల్ +ఎన్ అనే కీ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. సాధారణ బ్రౌజర్ కు భిన్నంగా నలుపు రంగులో కనిపిస్తుంది. దీనిలో మనం సెర్చ్ చేస్తే కుకీలు యాక్సెస్ చేయలేవు. కాబట్టి ఆ సమాచారాన్ని ఆయా వెబ్ సైట్లకు వెళ్లనివ్వవు. దీంతోపాటు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆన్ లైన్ బుకింగ్ లో చెల్లింపు దశలో ధర పెరిగే అవకాశాలను తగ్గిస్తుంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved