కచ్చులూరు గోదావరిలో బోటు వెలికితీసిన సత్యం

కచ్చులూరు గోదావరిలో బోటు వెలికితీసిన సత్యం

user-default | Mob: | 28 Oct

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందంతో పాటు స్కూబా డైవర్లు తీవ్రంగా కృషి చేసి దాన్ని ఒడ్డుకు చేర్చారు. గత నెల 15న పర్యాటకులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో అందులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటును బయటకు తీయడంతో గల్లంతైన 12 మంది ఆచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved