కార్లు, బైకుల నెంబరు ప్లేట్ పై పోలీసుల కన్ను

కార్లు, బైకుల నెంబరు ప్లేట్ పై పోలీసుల కన్ను

user-default | Mob: | 22 Oct

ట్రాఫిక్‌ పోలీసులు అనేక నిబంధనలను అమలులోకి తీసుకొచ్చినా కార్ల, బైకులు నిర్వాహకులు మాత్రం వాటిని అధిగమిస్తున్నారు. ఇలాంటి బైకులు, కార్లపై పోలీసులు ఉక్కు పాదo మోపుతున్నారు. తాజాగా, టోల్ గేట్, చెక్‌పోస్టుతో పాటు పలు సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో ఓ కారు నెంబర్‌ ప్లేటు పై అంకెలు వైఎస్‌ఆర్‌ అక్షరాలు ప్రస్పూటమయ్యేలా ఉన్నాయి. ఈ కారు యజమానిపై మోటారు వెహికల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మరో ఖరీదైన కారు అద్దాలకు నల్లటి స్టిక్కర్‌ వేసి ఉంది. స్టికర్‌ తీయించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకు స్టికర్‌లు తొలగించి వారిపై కేసులు నమోదు చేశారు. పలు బైకులపై నెంబర్ ప్లేట్ లేని వాహనాలను స్టేషన్ కి తరలించారు. నిబంధనలను ఉల్లగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved