స్మార్ట్ సిటీ కాదు అవినీతి సిటీ...సిపిఐ మధు

స్మార్ట్ సిటీ కాదు అవినీతి సిటీ...సిపిఐ మధు

user-default | Mob: | 27 Oct

తాగునీటి కోసం వర్షం లో తడుస్తూ -ఖాళీ బిందెలతో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ. గోదావరి చెంతనే ఉన్న కాకినాడ కార్పొరేషన్ కి తాగునీరు లేదని కాకినాడ చెందిన అపార్ట్మెంట్ వాసులకు మంచినీరు సౌకర్యం కల్పించాలని ,డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ,ఇంటిపన్ను చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక కాకినాడ కార్పొరేషన్ కార్యాలయాన్ని వందలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు .అంతకు ముందు డైరీఫార్మ్ నుండి జోరు వానలో ఖాళీ బిందులు పట్టుకుని ప్రదర్శనగా కాకినాడ కార్పొరేషన్ చేరుకున్నారు .మంచినీటి సౌకర్యం కల్పించాలని ,డ్రైనేజి మంజూరు చేయాలని ఇవ్వాలని ,సిపిఐ జిందాబాద్ అంటూ ఆందోళనకారులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కమిషనర్ వెంటనే రావాలని మా సమస్యలు పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు ఇచ్చారు సుమారు మూడు గంటలపాటు ఆందోళన కొనసాగించారు .ఛాంబర్ ముందు కూర్చుని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు . మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ ,ఈఈ వచ్చి సిపిఐ జిల్లా కార్యదర్శి మధు తో చర్చలు జరిపారు. కమిషనర్ వచ్చే వరకు మా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇక నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆందోళన కారులు వేసుకుని కూర్చున్నారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధుమాట్లాడుతూ గత వారం రోజులుగా తాగడానికి మంచినీరు లేక కాకినాడ అపార్టుమెంటు వాసులు ఉన్నారని ఆయన తెలిపారు .ఒక వారం రోజులుగా వర్షపు నీరు , మురికి నీరు ఇళ్లలోకి వచ్చిందని దీనివల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు .భయంతో ప్రజలు ఉన్నారని ఆయన తెలియజేశారు .కోట్ల రూపాయలు కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు నిధులు ఎక్కడికి పోతున్బయని అర్థం కావట్లేదని అవినీతి కాకినాడ గా తయారయింది అని ఆయన పేర్కొన్నారు .ఇది వెంటనే చేయకపోతే రాష్ట్ర కమిటీ తో ఆలోచించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు .కాకినాడ మూడు కూడళ్లలో రాష్రారోకో నిర్వహించి చేస్తామని తెలియజేశారు .ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు .ఇంటిపన్ను లు వేయాలని అన్నారు.ఈ కార్యక్రం లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి లోవరత్నం ఆందోళనకారులు కుమారి, జీవన ,వరలక్ష్మి ,బాషా శ్రీనివాస్,ప్రసాద్ ,జాన్ పాల్గున్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved