అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిరాహారదీక్షకు సిపిఐ మద్దతు

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిరాహారదీక్షకు సిపిఐ మద్దతు

user-default | Mob: | 25 Oct

అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు మంజూరు చేయండి లేకపోతె 18 ,19 తేదీన 36 గంటలు నిరాహారదీక్ష :::: - సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు హర్షం -చనిపోయిన కుటుంబాల ఎక్స్‌గ్రేషియో విడుదల చేయాలి కాకినాడ 21 సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ కష్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వర రావు నేతృత్వంలో పట్టుదల...సాహసోపేత నిర్ణయాలు...నిరంతరం సాగించిన చారిత్రక పోరాటానికి దక్కిన తొలి విజయం అగ్రిగోల్డ్‌ నిధుల విడుదల అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. సోమవారం స్ధానిక సిపిఐ కార్యాలయంలో సాయంత్రం ‌ ఆగేయగోల్డ్ కస్టమర్స్‌ అండ్‌ ఏజంట్స్‌ అసోసియేషన్‌ సమావేశం అసోసియేషన్‌ నాయకులూ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న తాటిపాక మధు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 264 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ పోరాట ఫలితంగానే బాధితులకు రూ 264కోట్లు వచ్చాయని, పోరాటం లో భాగస్వాములైన అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లకు ఈవిజయం దక్కుతుందని ఉద్ఘాటించారు..అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ ,బొమ్మరిల్లు ,గ్రీన్‌ గోల్డ్‌, కేశవరెడ్డి ఇలా ఇరవై మూడు సంస్థలు ప్రజలను మోసం చేశాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రూ. 20 వేల లోపు ఉన్నవారికి రూ. 1150 కోట్లు విడుదల చేస్తానని, అదికూడా మూడు నెలల్లోనే వారి ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు .జగన్‌ మాటమీద నిలబడతారనే నమ్మకంతో ఇప్పటి వరకు అసోసియేషన్‌ ఆందోళన చేపట్టలేదని, ఈ సమస్యను సత్వరమే పరిష్కారం చేయాలని మధు కోరారు. అదే విధంగా బడ్జెట్లో కేటాయించిన రూ.11 వేల కోట్లలో ఈ మొత్తాన్ని నిర్ణయించి తక్షణమే పాలనాపరమైన జీవోను విడుదల చేసి హైకోర్టుకు పంపాలని... హైకోర్టు ఆదేశాలతో బాధితులకు సొమ్ము చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ ద్వారా ,సిఐడి ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. లేనిపక్షంలో నవంబర్‌ 18, 19 తేదీల్లో విజయవాడ ధర్నాచౌక్లో 36 గంటల దీక్ష కొనసాగుతుందని తెలియజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ‌ 2015 జనవరి 4న అగ్రిగోల్డ్‌ సంస్థ మూసివేసిన నాటి నుంచి నేటి వరకు బాధితుల పక్షాన సిపిఐ ముందుండి పోరాడిందని, బాధితులకు చివరి పైసా వచ్చేవరకు కూడా అసోసియేషన్‌ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. రైతుసంగం జిల్లా ప్రధాన కార్యదర్శి R .సతీష్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రజాసంఘాలు అండగా ఉంటుందని, బాధితుల సమస్య పరిష్కారమయ్యేవరకు కూడా తాము అసోసియేషన్‌కు సహాయ, సహకారాలు అందిస్తూనే ఉంటామని వెల్లడించారు. ఈసమావేశంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులూ పిస్ నారాయణ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు లోవరత్నం ,రాంబాబు ,సత్యనారాయణ, భాగిరరాజు ,శేఖర్ మత్యుస్ ,లక్సమాన్రావు వారలష్మి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ....................................................

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved