సి బి సి యన్ సి వద్ద ఆందోళన

సి బి సి యన్ సి వద్ద ఆందోళన

user-default | Mob: | 25 Oct

కాకినాడ లో క్రైస్తవుల శాంతియాత్ర. ---సీబీసీఎంసి ఆస్తుల పరిరక్షణకు డిమాండ్. కాకినాడ : కాకినాడ నగరంలోక్రైస్తవ సంస్థల ఆస్తులు దురాక్రమణకు గురౌతున్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నగరం లోని క్రైస్తవులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మెక్లారిన్ పాఠశాల నుండి కలెక్టరేట్ వరకు శాంతియాత్ర జరిపారు.ఈసందర్భంగా మతపెద్దలు మాట్లాడుతూ ఇటీవల కొంతమంది దురాక్రమణ దారులు కాకినాడ సీబీఎం ప్రహరీ గోడ, క్రైస్తవ సభలకు వినియోగిస్తున్న స్టేజ్, దేవుని మందిరం, ప్రేయర్ టవర్, దానిపై ఉన్న శిలువ, ప్రాంగణంలో ఉన్న పాఠశాల విద్యార్థులు వినియోగించే బాత్రూములు కూల్చివేశారన్నారు. దీనితో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. క్రైస్తవుల రక్షణ, క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు గౌరవ ముఖ్యమంత్రి వెంటనే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ శాంతియాత్రకు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, కాకినాడ ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్స్, సీవైఫ్ ఇంటర్నేషనల్, వైఎంసీఏ రాష్ట్రీయక్రైస్తవ పరిషత్ తదితర సంఘాల6మద్దతు పలికాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved