అయోడిన్ ఉప్పుతో ఆరోగ్యం

అయోడిన్ ఉప్పుతో ఆరోగ్యం

user-default | Mob: | 22 Oct

అయోడిన్ ఉప్పు వాడకం తో వ్యాధులు దూరం.:డిఎం&హెచ్ఓ కాకినాడ :అయోడిన్ ఉప్పు వాడకం ద్వారా వివిధ రకాల వ్యాధులను దూరం చేయవచ్చునని జిల్లా వైద్య శాఖాధికారిణి డా. సత్యసుశీల పేర్కొన్నారు. అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్య శాఖాధికారి కార్యాలయం వద్ద అంగన్వాడీ, విద్యార్థులు తో అవగాహనా ర్యాలీ జరిగింది. ర్యాలీ ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ1996నుండి అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం జరుగుతోందని, ప్రస్తుతం 64 శాతం మంది మాత్రమే అయోడిన్ కలిపిన ఉప్పు గృహావసరాలకు వాడుతున్నారన్నారు.ప్రతి కుటుంబం అయోడిన్ ఉప్పు వాడాలని, ముఖ్యంగా గర్భవతులు, చిన్న పిల్లలకు ఇది తప్పనిసరి అన్నారు.పిల్లలకు సరైన మోతాదులో అయోడిన్ లేకపో6శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తుందన్నారు. ర్యాలీ శాంతిభవన్ వరకూ జరుగగా ఈకార్యక్రమంలో సీడీపీఓ విజయలక్ష్మి, కె. జగదీశ్వరీ రాణి, సూపర్వైజర్ అరుణశ్రీ, రాజేశ్వరి, దాయామణి, లైలా, ప్రభావతి, సుమారు150 మంది అంగన్వాడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved