అంతర్వేది దేవస్థానం దర్మకర్తగా మొగల్తూరు గోపాలరాజా బహదూర్

అంతర్వేది దేవస్థానం దర్మకర్తగా మొగల్తూరు గోపాలరాజా బహదూర్

user-default | Mob: | 19 Oct

✓ అంతర్వేది దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా రామగోపాలరాజా బహదూర్ ✓ దేవదాయ ధర్మాదాయశాఖ ఉత్తర్వుల జారీ అంతర్వేదిలో ప్రసిద్ధిచెందిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అను వంశిక ధర్మకర్తగా మొగల్తూరు రాజా వంశానికి చెందిన వారసుడు ఎస్ ఆర్ కేకే రామగోపాలరాజా బహదూర్‌ను నియమిస్తూ రాష్ట్రదేవదాయ ధర్మాదాయ శాఖ తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులుజారీ చేశారు. అనువంశిక ధర్మకర్తగా ఇప్పటి వరకు కొనసాగుతున్న కుమార సత్యనారాయణసింహజగపతి రాజా బహదూర్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులుజారీచేసింది. ఇప్పటివరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతున్న జగపతిరాజాబహదూర్ వయోభారం కారణంగా తన స్థానంలో తన కుమారుడైన ఎస్ ఆర్ కేకే రామ గోపాలరాజా బహదూర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకున్నారు. దీనిపై దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిని అధ్య యనం చేసి దేవదాయధర్మాదాయశాఖ అనువం శిక ధర్మకర్తగా రామ గోపాలరాజా బహదూర్ ను అంతర్వేది దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 ఏళ్ల వయస్సు పైబడటంతో ఆయన తండ్రి ఈబాధ్యతల నుంచి తప్పుకుని వారసత్వంగా సంక్రమించిన అనువంశిక ధర్మకర్తగా కుమారుడిని నియమించడానికి కృషి చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved