జగన్ ను కలిసిన చిరంజీవి

జగన్ ను కలిసిన చిరంజీవి

user-default | Mob: | 22 Oct

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు సమావేశమయ్యారు. చిరంజీవి దపంతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. సమావేశనంతరం చిరంజీవి-సురేఖ దంపతులకు జగన్‌ విందు ఇవ్వనున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా చిరంజీవి భేటీ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ భేటీలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాటు, రాజకీయ అంశాలు చర్చించే అవకాశం ఉంది. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి బడా స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదన్న విమర్శలు వైసీపీ నుంచి వ్యక్తమయిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, జగన్‌ను కలవడం చర్చనీయాశమైంది. అయితే ఈ నెల 11వ తేదీన జగన్‌తో చిరంజీవి భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. అనివార్య కారణాలతో వీరి సమావేశం వాయిదా పడింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసైని కూడా చిరంజీవి కలిశారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తమిళిసైని చిరంజీవి కోరారు. ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved