నో హెల్మెట్?

నో హెల్మెట్?

user-default | Mob: | 19 Oct

మంత్రి నుoచి అధికారుల వరకు..? ఉల్లంఘించిన సమాన్యాలపై భారీగా జరిమానాలు తొలిసారి పట్టుబడితే నెల... రెండోసారి పట్టుపడితే శాశ్వతంగా లైసెన్సు రద్దు.. గుంటూరులో రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణే లక్ష్యంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసు, రవాణా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, తద్వారా జరిగే మరణాలను అరికట్టేందుకు హెల్మెట్‌ధారణ తప్పనిసరి చేస్తున్నారు. గత నెల 12 నుంచి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌ వినియోగం తప్పనిసరి అని పోలీసు, రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. గతంలో ఇదే తరహాలో అనేక సార్లు ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కేంద్రం కూడా రోడ్డు ప్రమాదాలపై కఠినంగా వ్యవహరిస్తూ భారీ జరిమానాలకు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసు, రవాణాశాఖ అధికారులు ఈ దఫా హెల్మెట్‌ వినియోగాన్ని తప్పని సరి చేశారు. ఇదిలావుంటే నిన్న రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య ( నాని ) గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు షైక్ ముస్తఫా హెల్మెట్ లేకుండా బైక్ పై చక్కర్లు కొడుతూ బస్టాండ్ మొత్తం తిరిగారు. వీరిపై పోలీసులు రవాణా శాఖ అధికారులు ఫైన్ వేస్తారో వెయ్యారో చూడాల్సిందే..

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved