హైదరాబాద్‌ మెట్రోరైల్‌: డేంజర్‌ బెల్స్‌

హైదరాబాద్‌ మెట్రోరైల్‌: డేంజర్‌ బెల్స్‌

user-default | Mob: | 24 Oct

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ బాలరిష్టాలు ఎందుకు దాటడం లేదు ? ఎల్‌ అండ్‌ టీ లాంటి పెద్ద సంస్థలో సైతం నిర్వాహణ లోపాలు పదేపదే ఎందుకు తలెత్తుతున్నాయి ? ఊడుతున్న పెచ్చులు, టెక్నికల్‌ సమస్యలతో మెట్రో ఎందుకు మొరాయిస్తోంది? మెట్రోరైల్‌లో పరిస్థితులు మారవా? రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ట్రాఫిక్‌ జామ్‌ల నుంచి ప్రజల్ని కాపాడుతుందని ఏర్పాటుచేసిన మెట్రోరైల్‌లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న అమీర్‌పేట స్టేషన్‌లో పెచ్చులూడిపడటంతో ఓ మహిళ ప్రాణాల్ని కోల్పోయింది. దీనికి కారణం పర్యవేక్షణ లోపమేనని అధికారులు తేల్చిన పరిస్ధితి. మెట్రో స్టేషన్ల కింద నిలుచున్న ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసే స్ధాయికి మెట్రో నిర్మాణంలో లోపాలు వచ్చాయంటే ఇది ఎవరి తప్పు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎల్‌ అండ్‌ టీ లాంటి పెద్ద నిర్మాణ రంగ సంస్థ నిర్మిస్తున్న మెట్రోరైల్‌లో ఇన్ని లోపాలున్నాయా? అని ప్రయాణీకులు విస్మయపోయే పరిస్ధితి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved