పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు

user-default | Mob: | 28 Oct

గోదావరిలో వరద నీరు తగ్గుముఖం పట్టని కారణంగా జిల్లాలోని ఓపెన్‌ ఇసుక రీచ్‌లను ఇప్పట్లో తెరవడానికి ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇసుక కొరత సమస్యలు తలెత్తకుండా పట్టా భూములను లీజుకు తీసుకుని వాటిలో తవ్వకాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో క్యూబిక్‌ మీటరు ఇసుకకు రూ.60కి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా రూ.100కు పెంచేందుకు కూడా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో శనివారం అన్ని జిల్లాలకు చెందిన జేసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఏడు చోట్ల ఇసుక కలిగిన పట్టా భూములున్నట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే త్వరలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఓపెన్‌ రీచ్‌లు ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved