Babi Mahendra | Mob: 7794982345 | 11 Dec
బాలికలు అదృశ్యమైనప్పుడు, కిడ్నాప్‌నకు గురైనప్పుడు తక్షణం కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం పెద్దాపురం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాలికల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకపోయినా పోలీసులే బాధ్యత వహించి కేసులను ఛేదించి బాలికలను తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. మహిళలను కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టినట్లు ఫిర్యాదులు అందితే తక్షణం కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఐజీ వెంట పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ వి.శ్రీనివాసు, ఎస్సై వి.సురేష్, డివిజన్లోని సీఐ, ఎస్సైలు ఉన్నారు.
Leave a Message