విభేదాలు వివాదాలు కానీయొద్దు - మోదీ-జిన్‌పింగ్‌ కీలక నిర్ణయాలు

విభేదాలు వివాదాలు కానీయొద్దు - మోదీ-జిన్‌పింగ్‌ కీలక నిర్ణయాలు

user-default | Mob: | 19 Oct

బంగాళాఖాతం మీదుగా వీచిన చల్లని గాలులు భారత్‌-చైనాలకు చల్లని వార్తలు తెచ్చాయి. ‘విభేదాలు’ ‘వివాదాలు’గా ముదరకుండా చూసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. విశ్వాసపరంగానే కాదు.. వాణిజ్యంలోనూ ఉన్న లోటును భర్తీ చేసుకోవాలని తీర్మానించాయి. సరిహద్దులో ప్రశాంతత నెలకొనడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని అంగీకరించాయి. నాయకుల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలు ప్రజలకూ చేరువయ్యేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాయి. పల్లవుల ప్రాచీన నగరమైన మామల్లపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు శుక్ర, శనివారాల్లో జరిపిన ‘ఇష్టాగోష్ఠి శిఖరాగ్ర సదస్సు’లో పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. శనివారం ఇరువురు నేతలు కోవలంలోని తాజ్‌ ఫిషర్‌మేన్‌ కోవ్‌ రిసార్టులో సముద్ర అందాలను తిలకిస్తూ 90 నిమిషాల పాటు ముఖాముఖి చర్చలు జరిపారు. అంతకుముందు నేతలిద్దరూ సముద్ర తీరంలో విహరించారు. గోల్ఫ్‌ కార్ట్‌లో సమావేశ స్థలికి వచ్చి అధికార బృందాలతో జరిగిన చర్చల్లోనూ పాల్గొన్నారు. ‘వుహాన్‌ ఉత్సాహం’ (వుహాన్‌ స్పిరిట్‌)తో ఆరంభమయిన ఈ స్నేహం ‘చెన్నై సంబంధం’ (చెన్నై కనెక్ట్‌) వరకు వచ్చిందని దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved