కాకినాడ భాస్కర అపార్ట్మెంట్ బాధితుల ప్రెస్ మీట్

కాకినాడ భాస్కర అపార్ట్మెంట్ బాధితుల ప్రెస్ మీట్

user-default | Mob: | 27 Oct

భాధితులుగా రోడ్డుకీడ్చిన బిల్డర్ సత్తి బుల్లి వీర్రెడ్డి ని అరెస్ట్ చేయనీయకుండా సిటీ ఎమ్మెల్యే మోకాలడ్డుతున్నారు.. !! భాస్కర అపార్ట్మెంట్ బాధితులకు సుప్రీం ఆదేశాలు వర్తింప జేయాలి.. కొత్తప్లాట్లు నిర్మించి అప్పగించాలి : గాంధిభవన్ లో ఆదివారం ఉదయం భాస్కర అపార్ట్మెంట్ బాధితులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అఖిలపక్షం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటి పర్యంత మ య్యారు. విజయదశమి దీపావళి పండుగరోజుల్లో రోడ్డున పడిన బాధితులుగా కట్టుబట్టలతో పరాయిపంచన తలదాచుకుంటున్న దుస్తితి వచ్చిందని వాపోయారు. తమకు వచ్చిన ఈ కష్టానికి కారణమయిన విక్రం కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ బిల్డర్ ప్రమోటర్ సత్తి బులివీర్రెడ్డిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టుచేసి న్యాయస్తానం ముందు నిలబెట్టే ప్రక్రియజరగకుండా స్థానిక ఎమ్మెల్యే మోకాలడ్డు తున్నారని ఆరోపించారు. పన్నాగం ప్రకారం అపార్ట్మెంట్ నాణ్యతా ప్రమాణాలు నిభందనల ఉల్లంఘన కారణాలతో, పిల్లర్లు క్రుంగిపోయిన నెపంతో, ఖాళీచేయించి నేలమట్టం చేయించి తలో పది పరకా పంచి విలువయిన అపార్టు మెంటు స్థలాన్ని కబ్జా చేయడానికి బిల్డర్ ప్రమోటర్ వెనుక వున్న మాఫియా తన అధికార పలుకుబడితో సరికొత్త నాటకానికి తెరలేపి మెగా మాల్స్ నిర్మించే ప్రయత్నం చేసిందని సకాలంలో అఖిలపక్షం జోక్యం వహించడం వలన ప్రపంచానికి జరిగిన ఘటనలో వాస్తవాలు తెలిసాయన్నారు. సి ఎం జగన్ ఎంక్వైరీ చేయించి తమకు న్యాయం చేయిస్తారన్న నమ్మకంతో వున్నామని కరప మీటింగ్ లో ఇచ్చిన హామీప్రకారం ప్రభుత్వం దర్యాప్తు చేయించి సుప్రీం ఆదేశాలు వహించాలన్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం నేత నారాచంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కల్యాణ్ బిజెపి అధిష్టానం వామపక్షాల అగ్రనాయకులు స్పందించి శాసన సభ మండలి లో తమతరపున ప్రజాపక్షం వహించా లని కోరారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకుంటే సుప్రీం ఆదేశాల ప్రతులతో హైకోర్టు ను ఆశ్రయిస్తామని అదేరీతిగా మోసపొయిన వినియోగదారులుగా రాష్ట్ర వినియోగదారుల ఫోరం ని ఆశ్రయిస్తామని బాధితులు తెలియజేశారు.స్థానికంగా వున్న మాజీ ఎమ్మెల్యే మేయర్ ప్రతిపక్ష పార్టీనేతలయినప్పటికీ బాధితులకు అండగ ప్రత్యక్ష పరిశీల నకు రాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నగరంలో ప్రస్తుతం నాణ్యతలేని అపార్టుమెంట్లు రాజీవ్ గృహకల్ప కట్టడాలు ఎన్నివున్నాయో గుర్తించి వాటి ప్రమాణాలపై జె ఎన్ టి యు నివేదికలు తీయించి ప్రజల ప్రాణాలు ఆస్తులు ముందస్తుగా కాపాడేం దుకు కార్పోరేషన్ కౌన్సిల్ ప్రత్యేక అజెండాతో చర్చించాలని అఖిలపక్షం కోరారు. ఇందుకోసం వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. భాది తుల పిర్యాదుపై ప్రభుత్వం వహించిన చర్యలను కోరుతూ అమరా వతిలో సి ఎం జగన్ ని అక్టోబర్ మూడవ వారంలో మరోసారి ఎమ్మెల్సీ ఐ వి ఆధ్వర్యంలో భాదితులతో అఖిలపక్షం కలిసేందుకు ముందస్తు అనుమతులు తీసుకుంటు న్నామని తెలియజేశారు. సి ఎం తో బాటుగా ప్రధాన ప్రతిపక్షాల రాష్ట్ర అధినేతలను కూడా కలిసి పరిస్తితులను వివరిస్తామని అన్నారు. పాత్రికేయుల సమావేశంలో సిద్ది జోగేశ్వరరావు మామిడాల రామ క్రిష్ణ ఆలీషా సురేష్ గోపి విష్ణు శ్రీనివాసరావు వరలక్ష్మి క్రిష్ణ సూర్యనారా యణ సతీష్ తదితరులు వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. అఖిల పక్షం తరపున ప్రముఖసామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు సి పి ఎం నగర కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్ న్యూ డెమో క్రసీ కార్యదర్శి జల్లూరి వెంకటేశ్వర్లు టి ఎన్ టి యు సి అధ్యక్షుడు గదుల సాయిబాబా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధానకార్యదర్శి పిట్టా వరప్రసాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ సి పి ఐ నాయకుడు సత్యనారాయణ కాకినాడ వినియోగ దారుల సంఘం కార్యదర్శి హేజీబుశ్రీనివాసరామక్రిష్ణ, నగర అపార్ట్ మెంట్ యజమాను ల సమాఖ్య మాజీకార్యదర్శి వి వై ఎల్ నరశిం హా రావు సి ఐ టి యు కార్మిక సంఘ కార్యదర్శి పెడ్డింశెట్టిరామక్రిష్ణ పి ఆర్ కళాశాల విధ్యార్ధి నాయకుడు గంగుల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved