మద్య నిషేధంపై మాట తప్పిన ప్రభుత్వం

మద్య నిషేధంపై మాట తప్పిన ప్రభుత్వం

user-default | Mob: | 25 Oct

అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విధిస్తాను , మద్యం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పి... అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఇళ్ళమధ్య ప్రారంభించారు అని తెలుగుదేశం పార్టీ అదికార ప్రతినిధి ధూళిపూడి వెంకటరమణ(బాబి) అన్నారు. గతంలో 4380 షాపులు వుండేవని , రెవిన్యువల్ చేయించుకోనివి 777, మిగలినవి 3603, ప్రభుత్వం మొదటగా 20% దుకాణాలు తగ్గి స్తాము అని చెప్పారు దానిప్రకారం చూస్తే రాష్ట్రంలో 2883 షాపులు మాత్రమే వుండాలి కానీ ప్రభుత్వం ప్రారంభించినవి 3500, దీని ప్రకారం20%దుకాణాలు రద్దు ఎక్కడ అవినట్లు ? సామాన్యులకు అందుబాటులో లేని ధరలు, గతంలో చీఫ్ లిక్కర్ నిబ్బు 50 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం లో దొరికేది, ఇప్పుడు అదే నిబ్బు యం.ఆర్. పి రూ 80 వుండగా , జే టాక్స్ రూ 20 కలిపి వందరూపాయలు అమ్ముతున్నారు, గతంలో చల్లని బీరు రూ 110 అమ్మితే ఇప్పుడు జే టేక్స్ తో 130 అవ్వింది, అలాగే బార్లను రద్దు చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పాలసీలో బార్ల రద్దు ను గురించి పేర్కొనలేదు, దీంతో మద్యం షాపులకు బదులు బార్లలలో విక్రయాలు పెరిగేలా ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ వైసీపీ నాయకులకు వరప్రదాయినిగా మారింది, రూ ఎనిమిది వేలు కూడా అద్దె రాని భవనాలను రూ 80 వేలు అద్దె చెల్లించి అందులో ప్రభుత్వ మద్య దుకాణాలను నిర్వహిస్తున్నారు గతంలో ఒక మద్యం దుకాణం ద్వారా ప్రత్యేకంగా పదిమంది కి , పరోక్షంగా పదిమంది కి ఉపాధి లభించేది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలో ముగ్గురు కు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అస్తవ్యస్థ ఎక్సైజ్ పాలసీతో నాటు సారా , గుడుంబా మరియు స్పిరిట్ , దగ్గు మందులు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved