ఇక ఏటా వాహన మిత్ర

ఇక ఏటా వాహన మిత్ర

user-default | Mob: | 19 Oct

‘వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఇక ఏటా ఉంటుంది. సొంత ఆటోలు, క్యాబ్‌లు కలిగిన వారందరికీ ఏటా రూ.10 వేలు ఇస్తాం. ఐదేళ్లలో రూ.50 వేల చొప్పున మీ అకౌంట్లలో వేస్తాం. దేశ చరిత్రలోనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఇది ఒక్క మన రాష్ట్రంలోనే సాధ్యమైంది’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వాహనమిత్ర పథకం కింద ఎవరైనా దరఖాస్తులు అందించకుండా ఉండి ఉంటే.. లేదా పొరపాటున తెలిసో తెలియకో, దరఖాస్తు చేసుకోవడానికి సాయం అందక, అవగాహన లోపంతో మిగిలి ఉంటే.. అటువంటి వారందరికీ ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని, వలంటీర్ల సాయం తీసుకోవచ్చని, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా సహకరిస్తారని సీఎం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైయ్‌సఆర్‌ వాహన మిత్ర పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 73 వేల మంది లబ్ధిపొందేలా పది వేల రూపాయలు వారి ఖాతాల్లో జమయ్యేలా ల్యాప్‌ట్యాప్‌ మీట నొక్కి ఆరంభించారు. అంతకుముందు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో రూ.266 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆటోవాలాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నా.. ‘ఏలూరులోనే పాదయాత్రలో భాగంగా గత ఏడాది మే 14న హామీ ఇచ్చాను.. ఆటోవాలాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే అన్నమాట ప్రకారం హామీని నిలబెట్టుకున్నాను. ఇది ఎప్పటికీ మరిచిపోలేను. మీ అందరి తరపున ఒకటి చెబుతున్నాను నే ను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను.. మాటకు కట్టుబడ్డాను. ఇచ్చిన ప్రతి మాట ప్రకారం ఇప్పుడు ఆటో వాలాలంద రి ఖాతాలకు గంటల వ్యవధిలోనే సొమ్ము జమ అవుతుంది. ప్రతి పేదవాడికీ న్యాయం జరగాలి.. ప్రతి పథకం అర్హులకు అందాలి.. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలను చూడొద్దని అధికారులకు ఆదేశాలిచ్చాను. వాహనమిత్ర పథకం కింద అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. 75 వేల మంది బీసీలకు, 40 వేల మంది ఎస్సీలకు, 6 వేల మంది ఎస్టీలకు 17 వేల 500 మంది మైనార్టీలకు, 20 వేల మంది కాపులకు, 9,995 మంది ఈబీసీలకు ఈ పథకం వర్తింపజేశాం. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఉంచాం. అర్హత కలిగిన వారందరికీ పథకం వర్తించేలా చూశాం. రూపాయి లంచం ఇవ్వకుండా ఏకంగా లక్షా 73 వేల మందికి మంచి చేసే కార్యక్రమం చేశాం. రాష్ర్టానికి జగన్‌ అనే నేను సీఎంగా ఉన్నాను.. ఇప్పుడిదంతా గర్వంగా చెబుతున్నా. మంచి చేస్తే బండలా? ‘ప్రస్తుత రాజకీయాలు ఎలా మారిపోయాయో చూస్తు న్నాం. పట్టపగలే కళ్లెదుటే మం చి జరుగుతుంటే ప్రోత్సహించాల్సింది పోయి.. బండలు వేస్తున్నారు. అక్టోబరు 2న చంద్రబాబు వాడిన మాటలనుబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తోంది. అదేరోజు గొప్ప కార్యక్రమాలకు స్వీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఆవిష్కరించాం. ఏకంగా ప్రతి సచివాలయానికి 10-12 ఉద్యోగాలు వచ్చేలా చూశాం. వలంటీర్ల వ్యవస్థను అమలులోకి తెచ్చి లంచాలు లేకుండా పారదర్శకంగా ఇంటి వద్దకే సంక్షేమం చేరేలా చూశాం. ఇదంతా కాదనే వి ధంగా మాట్లాడుతున్నారు. గాంధీ జయంతి నాడు ఆయన క లలు కన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలకాలని.. తాగుడు మీద యుద్ధం ప్రకటించాం. కొత్త మద్యం పాలసీని తెచ్చాం. ఇంతకు ముందు 43 వేల బెల్ట్‌ షాపులు ఉండేవి. గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ అయితే దొరికేదో లేదో కానీ బెల్ట్‌షాపులు మాత్రం కనిపించేవి. కొత్త పాలసీ అమలులోకి తెచ్చాక ఒక్క బెల్ట్‌షాపును కూడా లేకుండా చేశాం. 4,500 మద్యం షాపుల ను 20 శాతం మేర తగ్గించి.. 3450 దుకాణాలు ఉండేలా చర్య లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందేమోనని చంద్రబాబు దుగ్ధతో తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. గాంధీ జయంతి రోజున మద్యం షాపులు తెరిచే ఉన్నాయని అబద్ధాలాడుతూ అభాండాలు వేస్తున్నారు. గాంధీ జయంతి రోజున మద్యం షాపులు ఎక్కడైనా తెరిచి ఉన్నాయా (సభికులను ప్రశ్నించారు)? తానేమో 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నానంటారు, 40 ఏళ్ల ఇండస్ర్టీనంటారు. ఇలాంటి పెద్దమనిషి పట్టపగలే అబద్ధాలు ఆడడం సమంజసమా? ఖాకీ చొక్కా వేసుకుని.. అంతకుముందు ఆటోడ్రైవర్ల సంఘం అధ్యక్షుడు అందజేసిన ఖాకీ చొక్కాను జగన్‌ ధరించారు. సమావేశం ముగిసే వరకు చొక్కాను అలాగే ఉంచుకున్నారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు నిలువెత్తు పూలమాలతో సీఎంను, రవాణా మంత్రి పేర్ని నానిని సత్కరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మీ అందరికీ సెల్యూట్‌ ‘విమర్శలకు తావు లేకుండా, అంతా పారదర్శకంగా వేల మంది లబ్ధిదారులకు మేలు చేకూరేలా కార్యక్రమానికి ఊతమిచ్చారు. అధికారులందరికీ సెల్యూట్‌. దరఖాస్తు చేసుకున్న వారందరికీ వలంటీర్లు నేరుగా సాయం చేస్తూ ముందుకు సాగారు.. ఇది నిజంగా అభినందనీయం.’

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved