సైరా టిక్కెట్ 350 రూపాయలు

సైరా టిక్కెట్ 350 రూపాయలు

user-default | Mob: | 25 Oct

సైరా దోపిడీ... రూ 350 కి టిక్కెట్... అభిమానుల పేరిట వసూళ్లు... రెవెన్యూ శాఖ వైఫల్యం... జిల్లాలో మరో చోట ఎక్కడ లేనివిధంగా మండపేట లో సినిమా టికెట్ ల దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది.ఫాన్స్ ముసుగులో దళారులు టికెట్టు నల్ల బజారు లో విక్రయాలు చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నటించిన 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి బుధవారం విడుదల కానుంది. ఈ క్రమంలో పట్టణంలోని ఏడు సినీ ధీయటర్ లలో ఈ చిత్రం ప్రదర్శించ నున్నారు.కాగా ఉదయం 5 గంటల కు బినిఫిట్ షో వేయనున్నారు. అలా 7 హాళ్ల కు సంధించి టికెట్ లు ఫ్యాన్స్ పేరిట రూ 200 చొప్పున ధీయటర్ నిర్వాహకులు నుండి పుచ్చుకున్నారు. కొందరు రాజకీయ నేతలకు కొన్ని టికెట్టు లు ఇచ్చి మిగిలిన టికెట్టు లు ఎక్కువ ధర కు అమ్ముకుంటున్నారని నిజమైన చిరు అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. విఫలమైన రెవెన్యూ... ఇలాంటి పరిణామాలు ఇక్కడ కొత్త కాదు.గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి.ప్రతి సినిమా రిలీజ్ సమయం లో ఇదే తంతు. సినీ హల్ వద్ద క్యూ ఏర్పాటు చేసి పోలీసుల రక్షణ లో టికెట్ లు విక్రయించాల్సి ఉండగా ఎప్పుడు అలా చేసిన దాఖలాలు లేవు. టికెట్ బుక్కింగ్ లో ఒక్క టికెట్టు అమ్మారు. అన్ని బయటకు వెళ్లి పోవడం ఇక్కడి రివాజు.నియంత్రించల్సిన రెవెన్యూ శాఖ పూర్తి గా విఫలమైందని పలువురు విమర్శలు చేశారు. మరుగుదొడ్లు అద్వాన్నం... ఇలా ఉంటే ఆయా హాళ్ల లో మరుగుదొడ్లు అద్వాన్నం గా ఉంటున్నాయని ప్రేక్షకులకు విమర్శించారు. ముఖ్యంగా కొత్త సినిమా విడుదల సందర్భంగా ఇంటర్ వెల్ లో ఒక్కసారిగా అందరూ మూత్ర విసర్జన కు వెళతారు.ఇరుకు గా ఉండే ఆ మూత్ర శాలలో దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఫిర్యాదు చేసిన స్పదించే వారే లేరు. అధిక ధరలు... ఇక హాళ్ల లో తిను బండరాలు,శీతల పానీయాలు ధరలు రెట్టింపు చేస్తూ దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్కింగ్ ఫీజు దారుణంగా వసూలు చేస్తున్నారు. నిబంధనలు మేరకు ధీయటర్ నిర్వహకులే పార్కింగ్ వసతి ఉచితంగా కల్పించాల్సి ఉంది.దీన్ని ఎక్కడా పాటించడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకొమని సమాధానం ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది. నిబంధనలు పాటించని హాళ్ల ను సీజ్ చేసే అధికారం ఉన్న అధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావు ఇస్తుంది.ఇక నైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని వీక్షకులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం... దీనిపై స్పందించిన మండపేట తహశీల్దార్ నాగలక్ష్మి మాట్లాడుతూ వీక్షకుల ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే అన్ని హాళ్ల వద్ద వి ఆర్ ఓ లను పంపి టికెట్ లు క్యూ లైన్ లోనే విక్రయించాలని ఆదేశించినట్లు తెలిపారు. మరుగుదొడ్లు పరిశీలించి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కచ్చితంగా తిను బండరాలు విక్రయిచే ప్రదేశాల్లో ఎం ఆర్ పి రేట్ లు పెద్ద అక్షరాలతో బోర్డ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved