ప్రభుత్వం ఆద్వర్యంలో మద్యం అమ్మకాలు

ప్రభుత్వం ఆద్వర్యంలో మద్యం అమ్మకాలు

user-default | Mob: | 28 Oct

ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల గడువు సెప్టెంబర్ 30 వ తేదీతో ముగిసింది. అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది. ఇందులో భాగంగా అన్ని చోట్లా ప్రభుత్వ దుకాణాలు రానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. ప్రాంగణాలు ఎంపిక చేయడం, అద్దె ఒప్పందాలు చేసుకోవడం, సిబ్బంది నియామకాలు, శిక్షణ వంటివి పూర్తి అయ్యాయి. సెప్టెంబరు 1 నుంచే లైసెన్సుల పునరుద్ధరణకు ముందుకురాని పలు చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సూపర్‌వైజర్లు, ఎక్సైజ్‌ ఎస్సైలు, సీఐలు మొబైల్‌ యాప్‌ల ద్వారా రోజువారీ అమ్మకాల వివరాలు నమోదు చేయనున్నారు. కాకినాడలో మద్యం కోసం దుకాణం ముందు గుమిగూడిన జనం. ఉదయం 10 గంటల నుండి ప్రారంభం జరగవలసినా 9 గంటలకు జనాలు వేచి చూస్తున్నారు. సమయం 11:30 అయ్యినప్పటికీ ఇంకా ప్రారంభం కాని దుకాణం.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved