జలమయంలో వాడపల్లి వెంకన్న ఆలయం

జలమయంలో వాడపల్లి వెంకన్న ఆలయం

user-default | Mob: | 29 Oct

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం, వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బుధవారం వచ్చిన అధిక వర్షాలకు జలమయమైంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆలయానికి చేరుకునే రహదారులు వర్షపు నీటితో ఛిద్రమయ్యాయి. అదేవిధంగా గుడి ప్రాంగణంకు మోకాలు లోతు నీరు చేరడంతో ఆలయ సిబ్బంది మోటార్లతో నీరు బయటికి తోడే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచి పనులు చేపట్టేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు తద్వారా ఆలయానికి వర్షపు నీటి ముంపు రాకుండా జరుగుతుందని తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved