పచ్చని పొలాల్లో మద్యం వద్దు...గ్రామస్థులు ఆందోళన

పచ్చని పొలాల్లో మద్యం వద్దు...గ్రామస్థులు ఆందోళన

user-default | Mob: | 19 Oct

కినాడ:ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణ గా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడా చోటు లేనట్లు పచ్చని పొలాల్లో మద్యం విక్రయ శాల ఏర్పాటు చేయడమా.. వద్దే వద్దు.. అంటూ ఆలమూరు మండలం చొపెల్ల గ్రామ ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అన్యo ఏసుబాబు మాట్లాడుతూ గ్రామ శివారు మూలపుంత లో తమ పొలాల తో బాటు శివాలయం, పాఠశాల, కళ్యాణ మండపం, వారపు సంత, తదితర ప్రజోపయోగ కట్టడాలు ఉన్నాయని తెలిపారు అలాంటి ప్రదేశం లో ప్రభుత్వ మద్యం షాపు ఏర్పాటు చేయాలని అనుమతులు మంజూరు చేశారన్నారు.అసలే ఇరుకుగా ఉన్న రోడ్ లో మద్యం షాపు పెడితే అసాంఘిక కార్యకలాపాలు తరచుగా జరుగుతాయని, మహిళలు నిర్భయంగా తిరగలేరని అన్నారు. మద్యం షాపు ఏర్పాటు ను అడ్డుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారన్నారు. అనుమతులు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకర సత్యనారాయణ, స్వామి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved